ఎండిపోతున్న తమ భూమిని చూసి కన్నీళ్లు చమ్మ గిల్లుతున్నాయి...
Show more
BG
Bhadra Gali
1 subscriber
Uploaded to LYKSTAGE
Aug 21, 2026
ప్రభుత్వం చేసిన మోసానికి ఒకసారిగా రైతుల్లో తిరుగుబాటు మొదలైంది. సంగం మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ వద్ద కావలి కాలువ రైతులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సక్రమంగా సరఫరా చేయడం లేదంటూ నిరసన తెలిపారు. అధికారులు ఏకపక్షంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారానికి మూడు రోజులు విద్యుత్ ఇచ్చి, నాలుగు రోజులు కోత విధించడం వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. సుమారు 15 వేల ఎకరాల సాగుపై విద్యుత్ కోతల ప్రభావం పడుతోందని తెలిపారు. రాత్రి 12 గంటల తర్వాతైనా పాత పద్ధతిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోతే పురుగుమందు డబ్బాలతో సుమారు 150 మంది రైతులతో సబ్‌స్టేషన్‌ను దిగ్బంధిస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.
Read more
Similar videos